Telugu Carona joke sms బజారులో తిరగడానికి వెళ్తా

Written by

బజారులో తిరగడానికి వెళ్తా 🛑

ఓ టీవీ ఇంటర్వ్యూ
Q.1. "మీకు కరోనా సోకితే ఏం చేస్తారు?
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?"
"ఏం నేనొక్కడినే బాధ పడాలా!!?"

Q.2. "సరే.. మీకు కరోనా సోకలేదు. ఇప్పుడేం చేస్తారూ?"
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?"
"నాకు కరోనా సోకలేదు కదా"

Q.3."మరి కరోనా సోకిన వారు  బజార్లో ఉన్నారు అని తెలిస్తే ఏం చేస్తారు?"
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?
"నేనో ప్రత్యేకమైన వ్యక్తిని నాకు ఎటువంటి మహమ్మారీ సోకదు అని తెలియజేయడానికి"

Q.4."చివరి ప్రశ్న.. ఈ దేశంలో మీ ఒక్కడికీ తప్ప అందరికీ కరోనా సోకింది.. అప్పుడు మీరేం చేస్తారు?
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?"
"నేనొక్కడినే బతికి ఏం పీకాలీ...🤦🤦🤦

అన్ని ప్రశ్నలకీ, అందరి సమాధానం ఒకటే. 
 #ఎవ్వడూ మార్చలేడు#


----------------------------------------------------------

Mask Jokes Telugu మాస్క్ జోకులు


అమ్మాయ్! కొత్త కాపురం ఎలా వుందే?
ఏడ్చినట్టుంది! మాస్కుకు గతిలేని వాడికిచ్చి నా గొంతు కోశారు!

------------------------

మాట మాస్క్ దాటితే మాస్కో చేరుతుందని ఊరకే అన్నారా వదినా!

------------------------

పిన్నీ! రేపు సాయంత్రం మా అమ్మాయి మాస్క్ పేరంటం! తప్పకుండా రావాలి!

------------------------------

ఏదో సామెత చెబుతారు చూడక్కా! మాస్క్ లేని వాడూ మగాడేనా అని! అలా వుంది.

-------------------------

అమ్మాయ్, చూపులయ్యాయటగా! ఎలా ఉన్నాడేమిటి?
ఫో పిన్నీ! మాస్క్ లేని మొగమూ, వాడూనూ!

---------------------------

మా కోడలు పిల్ల బంగారమమ్మా! మాట మాస్క్ దాటకముందే అన్నీ అందిస్తుంది!

--------------------------------

వాడికేం? జీవితం మూడు మాస్కులూ, ఆరు శానిటైజర్లూ.

--------------------------

బాబూ! వాడి జోలికి వెళ్లకు, మాస్కు ఊడదీసి తంతాడు!

---------------------------

అలా అంటావేమిటి బావా!
మనిషన్న వాడు మాస్కులమ్మి అయినా బతకాలిగా!

-------------------------

వాడికేమండీ! బంగారు మాస్కుతో పుట్టాడు.



Mask Jokes Telugu | మాస్క్ జోకులు | corona funny jokes Telugu





corona jokes in telugu

No comments: