Telugu Carona joke sms బజారులో తిరగడానికి వెళ్తా 🛑

Written by  
బజారులో తిరగడానికి వెళ్తా 🛑

ఓ టీవీ ఇంటర్వ్యూ
Q.1. "మీకు కరోనా సోకితే ఏం చేస్తారు?
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?"
"ఏం నేనొక్కడినే బాధ పడాలా!!?"

Q.2. "సరే.. మీకు కరోనా సోకలేదు. ఇప్పుడేం చేస్తారూ?"
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?"
"నాకు కరోనా సోకలేదు కదా"

Q.3."మరి కరోనా సోకిన వారు  బజార్లో ఉన్నారు అని తెలిస్తే ఏం చేస్తారు?"
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?
"నేనో ప్రత్యేకమైన వ్యక్తిని నాకు ఎటువంటి మహమ్మారీ సోకదు అని తెలియజేయడానికి"

Q.4."చివరి ప్రశ్న.. ఈ దేశంలో మీ ఒక్కడికీ తప్ప అందరికీ కరోనా సోకింది.. అప్పుడు మీరేం చేస్తారు?
బజారులో తిరగడానికి వెళ్తా
"ఎందుకూ?"
"నేనొక్కడినే బతికి ఏం పీకాలీ...🤦🤦🤦

అన్ని ప్రశ్నలకీ, అందరి సమాధానం ఒకటే. 
 #ఎవ్వడూ మార్చలేడు#

* అరవడం మొదలు పెట్టగానే కిటికీలు , తలుపులు మూసే వాడు " మనిషి " .

Written by  
* అరవడం మొదలు పెట్టగానే కిటికీలు , తలుపులు మూసే వాడు " మనిషి " .

వాటిని మూయటంతో పాటు టీవీ సౌండ్ పెంచే వాడు " పెద్దమనిషి " , *

తిట్లు , అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోకుండా తన పని తాను చూసుకునే వాడు " మహామనిషి " .

* ఏమీ వినపడనట్టు చొక్కా వేసుకొని బయటకు వెళ్లే వాడు " జ్ఞాని " .

ఇందులో మీరు ఏది:grin::joy:

Wife and Husband Jokes Telugu

Written by  
పక్కింటతను: సుబ్బారావు... ప్రతిరోజు మీ ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తుంటాయి ఇంత సంతోషంగా ఉండటానికి గల కారణం ఏమిటోయ్... ?

సుబ్బారావు :  నా భార్య నామీద రోజు గరిట విసురుతుంది. తగిలితే తను నవ్వుతుంది,తగలేకపోతే నేను నవ్వుతాను 
     ---------------------------x----------------x---------------------x-------------------------

 Friend 1: రేపు మీ marriage day కదా ఏం చేద్దమనుకుంటున్నవోయ్. 
ఫ్రెండ్ 2: లెంపలేసుకుందామనుకుంటున్నా 

     ---------------------------x----------------x---------------------x-------------------------

కొంతమంది మతం కోసం గొడవపడుతుంటారు

మరి కొంతమంది డబ్బుకోసం గొడవపడుతుంటారు 

ఇంకొందరు కులంకోసం గొడవపడుతుంటారు 

ఒక్క భార్యా భర్తలు మాత్రమే... దేనికో తెలియకుండా గొడవపడుతుంటారు  

     ---------------------------x----------------x---------------------x-------------------------

ఓ అతి తెలివి గడుగ్గాయి పెళ్లి చేస్కుందామని పేపర్లో ప్రకటన ఇవ్వాలనుకున్నాడు . 
అందరూ వధువు కావాలని ప్రకటన ఇవ్వడం చూసి విసిగి కాస్త వెరైటీగా ఉంటుందని ' పెళ్ళాం కావాలి '  అని ప్రకటన ఇచ్చాడు. 

అంతే మర్నాడు వేలకొద్దీ ఉత్తరాలు వచ్చాయి. అన్నింటి సారాంశం ఒక్కటే ' ఆలస్యం చెయ్యకుండా వచ్చి మా ఆవిడని తీసుకువెళ్లవచ్చు' అని   

     ---------------------------x----------------x---------------------x-------------------------

భార్య (మండిపడుతూ ) : పనికిమాలినవన్నీ గుర్తుంటాయి, నా బర్త్ డే  మాత్రం గుర్తుండదు.  అసలు ఎలా మర్చిపోతున్నావ్ హా ?!

భర్త (భయంగా )  :  అయ్యో, నిన్ను చూస్తుంటే వయస్సు పెరుగుతున్నట్లు అస్సలు  తెలియట్లా, ఆలా ఉన్నావ్ మరి  

భార్య (పొంగిపోతూ):  నిజమా ఆగండి  మీకోసం ఇప్పుడే పాయసం చేస్తా.. 

భర్త (రిలీఫ్ గా ): హమ్మయ్య, సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది. లేకుంటే ఈరోజు నా దెర్త్ డేనే...      


Telugu Joke


     ---------------------------x----------------x---------------------x-------------------------


మీకు తెలిసిన ఎవరైనా అమ్మాయి ఉంటే మా తమ్ముడికి పెళ్ళి సంబంధం చెప్పగలరు...
Qualification..
వంట రావాలి
పొద్దున్నే లేవాలి
మొబైల్ వాడకూడదు
తనని అసలే కొట్ట కూడదు
సీరియల్స్ అసలే చూడ వద్దు
సంప్రదాయ దుస్తులే ధరించాలి..

     ---------------------------x----------------x---------------------x-------------------------


Husband and Wife Jokes in Telugu

Click here for More Jokes in Telugu

పెట్రోల్ Petrol Joke Telugu

Written by  
ఇలాగే పెట్రోల్ రేట్లు పెరుగుతూ పోతే...

"నా కలల రాకుమారుడు
నాకోసం గుర్రమేసుకొని వస్తాడు"
అని ఒకప్పుడు అమ్మాయిలు కన్న కలలు 
ఇప్పటి అమ్మాయిలకు నిజమవుతాయి

 😍😌

ఇడ్లీ సాంబార్ చేయాలంటే కనీసం 50 వంట పాత్రలు అవసరం.

Written by  
ఇడ్లీ సాంబార్ చేయాలంటే కనీసం 50 వంట పాత్రలు అవసరం. 
బియ్యం పప్పు నానపెట్టి గిన్నె
గిన్నె మీద మూత
Moxie పాత్ర 
దాని మూత
కలిపే స్పూన్
పిండి తీసిపెట్టే గిన్నె
దాని మీద మూత
ఇడ్లీ పాత్ర
దాని మూత
4 ఇడ్లీ plates
Idli తీయడానికి స్పూన్
ఇడ్లీలు పెట్టడానికి హాట్ బాక్స్ 
దాని మూత
పప్పుకి cooker
దాని మూత
చింతపండు నాన పెట్టే గిన్నె
సాంబార్ చేయడానికి కడయి
స్పూన్
వెజిటబుల్స్ cutting tray, knife
వెజిటబుల్స్ కట్ చేసి వేయడానికి గిన్నె
మసాలా దంచే కల్వం
సాంబార్ తీయడానికి బౌల్
దానికి మూత
కొబ్బరి chtnuy కి ఇంకో మిక్సి జార్
మళ్లీ మూత
Chutney తీయడానికి గిన్నె
దానికి మూత
స్పూన్
minimum నలుగురికి 4 plates
4 spoons
8 గిన్నెలు ( సాంబార్ + chutney)

ఇంకా మిగిలే ఉంటాయి.
 
ఇప్పుడు తెలిసింది ఇడ్లీ చేసిన రోజు పనిమనిషి ఎందుకు రాదో 

😂😂😂😂

గిన్నెలు కడుగుతుంటే రాయాలని ఆలోచన వచ్చింది.
రాసేసాను. 
ఫస్ట్ టైమ్ రాయడం.
అత్త: ఇదిగో కోడలు పిల్లా! ఓ సారిలా రా!

Written by  
ఇదే... తెలు'గత్తయ్యా' 
●●●●●●●●●●●●●●●●

అత్త: ఇదిగో కోడలు పిల్లా! ఓ సారిలా రా!

కోడలు: వస్తున్నా నత్తయ్యా!

అత్త: అత్తయ్యా అని అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా అని అనకపోతే

కోడలు: నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని గూడ వున్నారు, అబద్ధమాడ కత్తయ్యా! మైల పడిపోతారు.

అత్త: ఇప్పుడే మన్నావ్! కత్తయ్యా అనలేదటే! పరమ సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా!

కోడలు: అయ్యో! నా ఖర్మకొద్దీ దొరికా రత్తయ్యా మీరు!

అత్త: మళ్ళీ ఇంకో కొత్త కూత! ఇప్పుడు రత్తయ్యా అని అన్నావా లేదా?

కోడలు: అయ్యో! నా రాత! అది సంధి. మీరు తెలుగు సరిగ చదువుకోలేదత్తయ్యా!

అత్త: మరో మాయదారి కూత. దత్తయ్యా అట! వాడెవడు? అయ్యో! అయ్యో! నేను నీలాగ చదువుకోలేదని నన్ను నత్తయ్యా, కత్తయ్యా , రత్తయ్యా, దత్తయ్యా అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే! అబ్బాయిని ఇంటికి రానీ! చెబుతా నీ సంగతి!!!

కోడలు: అలా ఉడికి పోయి ఆయాసం తెచ్చు కోకండి. బిపి పెరుగుతుంది. మీరనుకున్న వన్నీ ‘ఉకారసంధి’ వలన ఏర్పడిన పదాలత్తయ్యా!

అత్త: ఓరి దేవుడో! నన్ను మళ్ళీ లత్తయ్యంటోంది నాయనో!

------------------------------------------------------------------------------------


కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు

Written by  
పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
 😜 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు

👉 మనకు అర్థం కాకున్నా భద్రంగా  దాచుకునేది ఏది?
😜 డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్

👉 ”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?
😜  డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి.

👉 సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?
😜 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు.

👉 భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?
😜 మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి

👉 పొలాలు అభివృద్ధి చెందితే?
😜 ప్లాట్లు అవుతాయి

👉 డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
😜 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేసెంట్ చెప్పినప్పుడు..
😂********🤣

“SORRY “ అనే పదము చాలా
చిత్రంగా  ఉంటుంది.

మనము చెబితే మన వాళ్ళు
దగ్గరౌతారు.

అదే  డాక్టర్  చెబితే
మనవాళ్ళు మనకు
దూరమౌతారు....!😂
******** ప్రపంచంలో 
రెండు అతి ప్రమాదకరమైన 
మారణాయుధాలు!
1. భార్య కన్నీరు 
2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!
😜😜😜🤣🤣🤣
********
మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . . 
కానీ ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .
😄😄😄😄😄😀
********
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు  వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా.......................
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ 😜😜
********
మీరు నవ్వుకోవడం కాదు అందరికి పంపండి....

ఒక విద్యార్థికి ఉపాధ్యాముడు ’ఎలక్ట్రిసిటి’ అనే పదం నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు

Written by  
క్లాస్ రూం జోక్స్

ఒక విద్యార్థికి ఉపాధ్యాముడు ’ఎలక్ట్రిసిటి’ అనే పదం నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు. వారి మద్య సంభాషణ ఇలా ఉంది.
ఉపాద్యాయుడు : ’ఎలక్ట్రిసిటి’ అనరా రాము
రాము : ’ఎలక్ట్రికిటి’
ఉపాద్యాయుడు : ఎలక్ట్రికిటి కాదు ఎలక్ట్రిసిటి
రాము : ఎలక్ట్రికిటి
ఉపాద్యాయుడు : కిటి కాదు ’సిటి’ ’సిటి’
రాము : ’కిటి’ ’కిటి’

ఉపాద్యాయుడు రాముకు ఆ పదం నేర్పడం కష్టమనుకుని రాము వాళ్ళ తండ్రిని కలిసి విషయం వివరించాడు. అప్పుడు. .

రాము తండ్రి : వాడికి ఆ పదం రాకపోతే వదిలేయండి సార్ దీనిని మీరు ’పబ్లికిటి’ చేయకండి.
ఇతనికి కూడా ’సిటి’ అని పలకటం రాదా అనుకుని రాము వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు.
ఉపాద్యాయుడు : ఏంటండి మీ కొడుకేమో ’పబ్లిసిటి’ ని ’పబ్లికిటి’ అంటున్నాడు మీ మనవడేమో ’ఎలక్ట్రిసిటి’ ని ’ఎలక్ట్రికిటి’ అంటున్నాడు. ఏం చేద్దామంటారు ?
రాము తాత : ఇంత చిన్న విషయానికి నా వరకు రావాలా సర్ అది వాళ్ళ ’కెపాకిటి’ సర్
ఉపాద్యాయుడు : ఆ ఆ ఆ ????????

Carona Funny Message Telugu ఇంకెక్కడి ఫంక్షన్ లు

Written by  
ఇంకెక్కడి ఫంక్షన్ లు ... 
నెల  రోజులు యింది... కొత్త చీరలు  కట్టి.. 
నిన్న  బీరువా  లో  నుండి  ఒకటే  నీళ్లు..  వస్తున్నాయి ఏంటబ్బా... అని  చూస్తే... 
కట్టేవాళ్ళు.. లేక.. నిరాదరణకు.. గురై.... కుళ్ళి  కుళ్ళి  ఏడుస్తున్నాయి ఆ చీరలు..     
కోకావిలాపము...
🥻🥻🥻🙉🙉😭😭

తనవైపు  కూడా  చూడట్లేదని.. అద్దం... ఆవురావురుమని.. చూస్తుంది..... 
దర్పణవిలాపము 
🤖😭

పౌడర్లు, క్రీములు, perfume లు..ఇంక  మాతో.. నీకేమి.. పని లేదులే.. అని  మూతి.. తిప్పుతున్నాయి.
సౌందర్యవిలాపము ... 
💄💋👧🏼👩🏾😢😢

మార్చి .మార్చి... వేసి... ఉతికి.. ఉతికి... సంపుతు న్నారని.. nighty  ల.. సంఘం.. అధ్యక్షురాలు.. ధర్నా.. చేయడానికి... పావులు. కదుపుతుంది... 
అలసి సొలసిన విలాపం!
👗👚😭😭

ఎప్పుడు.. విడి విడి  గా  ఉండే చెప్పులు... చాలా  రోజుల  తరువాత.... ఒక్కటిగా  గడిపే  సమయం  వచ్చి.. ముద్దు.. ముచ్చట్లాడుకుంటున్నాయి
జోళ్ళ సలాపము .... 
🥿👠👡👞🧦🧦😅

నిమిషం.. తీరిక లేకుండా... వాడేస్తూన్న . tv  లు..శక్తివంచన  లేకుండా... వాటి  ఊపిరి దారపోస్తున్న  మొబైల్స్.. మాత్రం... వీళ్ళ.. lockdown.. ఎప్పుడు.. పూర్తి  అవుతుందా.... ఎప్పుడు... అలా.... బ్యాంకాక్.. వెళ్లి... సేద  తీరుదామా  అని... ఆలోచిస్తున్నాయి .... 
సాంకేతిక  విలాపము... 🖥️📺📱📞☎️😭😭

ఏ వారానికో  ఒకసారి తీయబోతే మొరాయిస్తున్న వాహనముల  వైనం!
యంత్ర విలాపం !
🚀🚲🏍️🚗😭

మన  ప్రస్తుత.. పరిస్థితి  పై... చిన్న  పారడీ/కామెడీ.

గురువుగారూ! మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది

Written by  
"గురువుగారూ! మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది! ఫేస్ బుక్ లో గానీ,ట్విట్టర్ లోగానీ,ఇన్స్టాగ్రామ్ లో గానీ ఉన్నారా?"

" అబ్బే!లేదండీ! మీ ఎదుటింట్లో గత పదేళ్ల నుండీ ఉంటున్నా! "

  😜😁😀😆😂🤣