Husband Jokes Telugu

Written by

 Jokes on Husband Telugu



ఈ సృష్టిలో అందమైన జాతి మగజాతి..

ఆడ నెమలి కంటే మగ నెమలి అందంగా ఉంటుంది..

ఆడ సింహం కంటే మగ సింహం జూలు ఉండి అందం గా ఉంటుంది...

మగ పావురం కంఠం దగ్గర రంగులతో అందం గా ఉంటుంది..

మగ కోయిల మాత్రమే అందంగా పాడుతుంది..

కోడి లో పెట్ట కన్నా పుంజు అందంగా ఉంటుంది..

అబ్బాయిలకు పైత్యం వలన అమ్మాయిలు అందం గా కనిపిస్తారు.. అంతే

                     ------------------- ------------ ----------------


ఒక రాజకీయ నాయకుడు , ఒక దొంగ, "భార్యాభయస్తుడు" ఒకేరోజు మరణించి నరకానికి వెళ్లారు .
వెళ్ళిన దగర నుండి చిత్రగుప్తుడి దగ్గర రాజకీయనాయకుడు నానా గొడవ చేయడం మొదలు పెట్టాడు.
నా పార్టీ వాళ్ళతో చాలా మాట్లాడాలి ఒకసారి ఒక్కసారి ప్లీజ్ అని అని బతిమాలసాగాడు.
డబ్బులిస్తే " నరక నెట్వర్క్ " ద్వారా ఫోన్ చేసుకోవచ్చని అక్కడ చిత్రగుప్తుడు చెప్పడంతో మొదట రాజకీయనాయకుడు ఫోన్ చేసుకుని ఐదు నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు.
ఎంత ? అన్నాడు రాజకీయ నాయకుడు .
ఐదు లక్షలు అన్నాడు చిత్ర గుప్త.
వెంటనే రాజకీయ నాయకుడు చెక్ రాసిచ్చి వెళ్ళిపోయాడు .
ఇదంతా చూస్తున్న దొంగకి ఈర్ష్య కలిగింది .
నేను మా దొంగల గ్రూపుకి ఫోన్ చేసుకోవాలి అని అడిగి ఫోన్ చేసుకుని రెండు నిముషాలు మాట్లాడి పెట్టేశాడు .
ఈసారి అతని వద్ద పది లక్షలు వసూలు చేశాడు చిత్రగుప్తుడు.
ఇప్పుడు భార్య భయస్తుడు ఇంటికి చేసి భార్యకు వంటిల్లు , ఇంటి పని కష్టాల గురించి దాదాపు పది గంటలు మాట్లాడాడు .
అంతా అయిపోయాక యెంత అని అడిగాడు చిత్ర గుప్తుడిని.
ఆ పది రూపాయలు అన్నాడు చిత్రగుప్త .
అదేంటి అంత తక్కువ అని ఆశ్చర్య పోయాడు భార్య భయస్తుడు. దానికి చిత్రగుప్తుని సమాధానం ... ఇలా ఉంది..
#నరకం నుండి #నరకానికి లోకల్ కాల్ ...

    ------------------- ------------ ----------------
* అరవడం మొదలు పెట్టగానే కిటికీలు , తలుపులు మూసే వాడు " మనిషి " .

వాటిని మూయటంతో పాటు టీవీ సౌండ్ పెంచే వాడు " పెద్దమనిషి " , *

తిట్లు , అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోకుండా తన పని తాను చూసుకునే వాడు " మహామనిషి " .

* ఏమీ వినపడనట్టు చొక్కా వేసుకొని బయటకు వెళ్లే వాడు " జ్ఞాని " .

ఇందులో మీరు ఏది



    ------------------- ------------ ----------------

నేను ఒక రోజు పెద్ద కొండల మధ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నాను..
 వెళ్తుండగా... ఒక పెద్ద శబ్దం💥💥 వినబడింది.. "ఆగు"🤚🏻 అని..
చూస్తే ఒక పెద్ద బండ పై నుంచి పడుతూ నా పక్క నుండి వెళ్లి పోయింది...
వెంట్రుక వాసి తేడా లో తప్పించు కొన్నాను..
🙏🏻ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాను... మళ్లీ అదే శబ్దం వినబడింది..
💥💥"ఆగు"🤚🏻అని.. చూస్తే ఒక కారు🚗🚗 నా పక్క నుండి వేగం గా దూసుకొని వెళ్లింది..
మరలా వెంట్రుక వాసి తేడా తో తప్పించు కొన్నాను..
భయంతో అడిగాను...
ఎవరు నువ్వు అని.. అప్పుడు పై నుంచి వినిపించింది..
"నేను నిన్ను కాపాడే దేవుడను"...
అప్పుడు ఏడుస్తూ అడిగాను...
😢😢ఇన్ని సార్లు కాపాడు తున్న దేవుడు మీరు.. నా పెళ్లి సమయంలో ఎందుకు ఆగు అని చెప్పలేదు???? 😢😔😔🤔..
"" "" పిచ్చి వాడా... 🤦🏻‍♂అప్పుడు ఇంత కంటే ఎక్కువగా అరిచాను.. కానీ నువ్వు ఎక్కడ వినే పొజిషన్ లో ఉన్నావు... ఆ బాజాలు భజంత్రీలు... బంధువుల అరుపులు... నువ్వు ఎక్కడ విన్నావు.. అనుభవించు... నీ కర్మ  

  ------------------- ------------ ----------------

ఇడ్లీ సాంబార్ చేయాలంటే కనీసం 50 వంట పాత్రలు అవసరం. 
బియ్యం పప్పు నానపెట్టి గిన్నె
గిన్నె మీద మూత
Moxie పాత్ర 
దాని మూత
కలిపే స్పూన్
పిండి తీసిపెట్టే గిన్నె
దాని మీద మూత
ఇడ్లీ పాత్ర
దాని మూత
4 ఇడ్లీ plates
Idli తీయడానికి స్పూన్
ఇడ్లీలు పెట్టడానికి హాట్ బాక్స్ 
దాని మూత
పప్పుకి cooker
దాని మూత
చింతపండు నాన పెట్టే గిన్నె
సాంబార్ చేయడానికి కడయి
స్పూన్
వెజిటబుల్స్ cutting tray, knife
వెజిటబుల్స్ కట్ చేసి వేయడానికి గిన్నె
మసాలా దంచే కల్వం
సాంబార్ తీయడానికి బౌల్
దానికి మూత
కొబ్బరి chtnuy కి ఇంకో మిక్సి జార్
మళ్లీ మూత
Chutney తీయడానికి గిన్నె
దానికి మూత
స్పూన్
minimum నలుగురికి 4 plates
4 spoons
8 గిన్నెలు ( సాంబార్ + chutney)

ఇంకా మిగిలే ఉంటాయి.
 
ఇప్పుడు తెలిసింది ఇడ్లీ చేసిన రోజు పనిమనిషి ఎందుకు రాదో 

😂😂😂😂

గిన్నెలు కడుగుతుంటే రాయాలని ఆలోచన వచ్చింది.
రాసేసాను. 
ఫస్ట్ టైమ్ రాయడం.


    ------------------- ------------ ----------------

More Telugu Funny SMS
telugu-comedy-marriage-SMS-joke


Husband Jokes Telugu😋




No comments: