ఈ వేసవి సందడే సందడి.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
ఇళ్ళల్లో కోడ్ ఆఫ్ కాండక్ట్ కి తిలోదకాలిస్తారు జనం. ముఖ్యంగా మగరాయుళ్ళు. లుంగీలు, పైజామాలు ఎగ్గట్టి టీవీల ముందు రాత్రీ పగలూ తాపటం వేసుక్కూర్చుంటారు. ఎన్నికల చర్చలు, ఒపీనియన్ పోల్స్, బెట్టింగులు, నాయకుల పరస్పర దూషణలతో జనాలకి విందు భోజనం రెడీ!
పిప్పి పి పీపిప్పీ అని సిగ్నేచర్ ట్యూన్ బాకా ఊదుతూ మరోపక్కనుంచి IPL రంగప్రవేశం చేస్తుంది.
పిల్లలు అనే వానర మూకకి వేసవి సెలవులు ఆరంభం.
ఈ మూడు ఘట్టాలకు తాత లాంటి మరో సన్నివేశం ఆవిష్కరిస్తుంది – కొత్తావకాయ ఆగమనం.
దాని అమ్మమ్మలాంటి రసవత్తర నాలుగో అంకం-మామిడి పండ్ల సీజన్ రాక!
పతాక సన్నివేశాన్ని సూర్యుడు ఎలాగూ చూపిస్తాడు నిప్పులు కురిపించి.
ప్రతి ఇల్లూ పూనకం వచ్చిన పోలేరమ్మ జాతరవుతుంది. కొంప కొల్లేరవటం అంటే ఇదే!
‘ఇల్లు నా బాధ్యత’ అని తలపోసే సాధ్వీమణి అంటూ ఉంటే ఆమెకి ఈ వేసవి ఒక అగ్నిపరీక్షే! ‘ఈ సమ్మర్ అయ్యే దాకా, ఏ రావణాసురుడో నన్ను కిడ్నాప్ చేస్తే బాగుండు, అదే బెటర్!’ అని ప్రార్థనలు చేస్తూ సేవలు చేస్తుంది.
ఇల్లాలు ఏ తాటకో, సూర్ఫణకో అయితే, ఆ ఇంట్లో పురుషులు ‘నాయనా! శ్రీరామచంద్రా!’ అంటూ ఓపిక చేసుకుని, ఆ లంకిణిని బుజ్జగిస్తూ IPL, ఎన్నికల విశ్లేషణలు చూడనట్టు నటిస్తూ చూస్తారు.
అదిగో అప్పుడే మందు గుర్తుకొస్తుంది. అసలే సమ్మర్. ఇంకేం! ఏరులై పారుతుంది ‘బీరోదకం’
జూన్ నెల వస్తుంది.
అందరి కంటే ఎక్కువగా బూతులు తిట్టి, ఎన్నికల్లో గెలిచిన నాయకులు మీసాలు దువ్వుకుంటూ పార్లమెంట్ అనే విలాసవంతమైన మయసభలోకి అడుగెడతారు. మరో ఐదేళ్లు వాళ్ళు మాయం.
IPL ఆడిన క్రికెటర్లు కోట్ల రూపాయలు జేబులో వేసుకుని పండగ చేసుకుంటారు. వాళ్ళూ గాయబ్!
మార్చి నుంచి జూన్ దాకా ఎన్నికల చర్చలు, IPL వేడిలో పడి ఒళ్ళు మర్చిపోయి, ఆ మత్తులో వేడి అన్నంలో కొత్త ఆవకాయలు, పచ్చళ్లు కలిపి కుమ్మేసి, అదే చేత్తో చెరకు రసాలు, బంగినపల్లి మామిడిపళ్ళు జూర్రేసిన జనాలు, ఎన్నికలు, IPL అయిపోయాక స్పృహలోకి వస్తారు. బీర్ల మత్తు వదులుతుంది.
అనస్తీషియా ఎఫెక్ట్ పోయి నొప్పులు తెలియటం మొదలవుతుంది.
మూడు నెలలు ఎడతెరిపి లేకుండా దట్టించటంతో, ఒంట్లో షుగర్, ఉప్పు కారం పెరిగి, జూన్ నెల తొలకరి వాన కురవంగానే, ఆరోగ్యం వికటించి, డాక్టర్ల ముంగిట క్యూ కడతారు. డాక్టర్ బిల్లులతో వాచిపోతుంది.
ఏసీలు హోరెత్తేలా పని చేశాయి కదా! పిడుగు లాంటి కరెంట్ బిల్లు వస్తుంది.
ఎన్నికలు అయిపోయాయిగా! ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి.
దూల తీరుతుంది మనకి.
“వెధవ ఎన్నికలు! వెధవ IPL! వెధవ టీవీ! నెక్స్ట్ ఇయర్ చూడకూడదు” అని ఒట్టు పెట్టుకుంటాం.
‘వేసవి వైరాగ్యం’ అది. జస్ట్ ఓ తొమ్మిది నెలలు ఉంటుంది.
మళ్ళీ వేసవి వస్తుంది. IPL వస్తుంది...మళ్ళీ ఏదో ఒక రాజకీయ సంక్షోభం వచ్చి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలొస్తాయి...మళ్ళీ మామిడి పూస్తుంది.
పిప్పి పి పీపిప్పీ అని బాకా ఊదుతూ, మళ్ళీ అనస్తీషియా డోస్ తీసుకుంటాం!
విష్ యూ ఎ హాపీ సమ్మర్!

telugu funny memes, telugu funny memes images
ated searches
Telugu funny memes telugu funny memes images download
funny memes in telugu latest
telugu memes dialogue
telugu funny meme templates
funny telugu memes on friends
telugu funny memes videos
telugu funny memes download
More for You
- Happy Birthday SMS in Telugu
- Very Good Telugu Quotes | Best Quotes In Telugu
- Telugu Prema Kavithalu | telugu love kavithalu
- Birthday Quotes in English
- Joke in Telugu
- Telugu Funny SMS | Telugu Jokes | Telugu SMS
- Christmas Greetings | Merry Christmas Wishes
- All the very best | Good Luck Quotes
- Best Friend Message
- Funny Telugu Joke
No comments: